* అవినీతిలో ఆరితేరిన ఘనుడు..
* గతంలో మెంబర్ సెక్రెటరీ బదిలీ చేసిన మారని తీరు..
* చేయి తడవందే సార్ దగ్గర పనికాదు..
* పరిశ్రమలు ఎంత పొల్యూషన్ చేసిన సారుకు పట్టదు..
* ఫార్మా, మైనింగ్, క్రషర్, రైస్ మిల్లుల యాజమాన్యాల దగ్గర భారీగా వసూళ్లు..
* పరిశ్రమలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చిన డోంట్ కేర్.. అక్రమ వసూళ్లే ముఖ్యం..
* పొల్యూషన్ బాధితులు ఏమైనా కానీ పరిశ్రమల యాజమాన్యాలకు కొమ్ముకాస్తారు..
* ఆది నుంచి అవినీతి పాదే..
* ఈయనగారి అక్రమాస్తులు లెక్కకు మించి..!
* ఆర్.ఒ.లు తప్ప వేరే ఎక్కడ పని చేయడానికి ఇష్టపడని సారు..
కాలుష్య నియంత్రణ మండలిలో అతనో కీలక అధికారి. తనకు ఆర్.ఒ.లలో పనిచేయడం తప్ప కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాలలో పని చేయడానికి అస్సలు ఇష్టం ఉండదు. దీనికి కారణం ఉందడోయ్.. ఆర్.ఒ.లలో పనిచేయడానికి ఇష్టపడుతుండు అంటే ఆయనేదో ఉద్దరిస్తాడు అనుకునేరు.. ఎందుకంటే ఆర్.ఒ.లలో అయితే ఆయనకు ఆయనే బాస్ కాబట్టి.. అంతా ఆయనదే రాజ్యం.. సకల రాజయోగాలు అనుభవించొచ్చు.. ఇక విషయానికి వస్తే..
కాలుష్య నియంత్రణ మండలి అధికారి అంటే పొల్యూషన్ చేస్తున్న ఫార్మా కంపెనీలు, మైనింగ్, క్రషర్ మిల్లులు, రైస్ మిల్లులు, పేపర్ మిల్లులు మొదలగు ఇతర కాలుష్య పరిశ్రమలను కట్టడి చేసి పర్యావరణాన్ని పరిరక్షించి ప్రజల ఆరోగ్యాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించాలి. కానీ ఇ.ఇ. భిక్షపతికి ఇవేమీ పట్టవు. మొదటి నుండి అవినీతిలోనే ఆరితేరిండు. ప్రతి పనికి ఓ రేటు.. నెలనెలా లక్షల్లో సంపాదించందే నిద్రపట్టదు. ఈయన గారి గతమంతా అవినీతిమయమే.. ఎక్కడ పనిచేసిన అవినీతి మూలాలే.. ఎఇఇ గా పనిచేసిన.. ఇఇ గా పనిచేసిన అక్రమ సంపాదనే లక్ష్యం. లక్షల్లో వసూళ్లే ఆయన నైజం. కోట్లలో అక్రమాస్తులు ఉన్న తీరని ఆశ. ఈయనగారి అవినీతి సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది.
ఇఇ బిక్షపతి ఎక్కడ పనిచేసిన అక్రమాస్తుల సంపాదనే ధ్యేయంగా పనిచేస్తారని అందరి నోట వినిపిస్తున్న మాట. ఫార్మా పరిశ్రమలు, క్రషర్ మిల్లులు, రైస్ మిల్లులు ఇలా చెప్పుకుంటే పోతే పరిశ్రమలు ఏవైనా సరే.. ప్రతి నెల లంచాల రూపంలో లక్షలు రావాల్సిందే. ఫిర్యాదులు వచ్చిన కంపెనీల నుండి ముక్కు పిండి లక్షల్లో వసూలు చేస్తాడని పరిశ్రమల యాజమాన్యాలే వాపోతుండడం విశేషం. గతంలో పనిచేసిన నిజామాబాద్, సంగారెడ్డి, నల్లగొండ ప్రస్తుతం రామగుండం ఎక్కడ పనిచేసిన అవినీతి అక్రమాలే. నిజామాబాద్ ఇఇ గా ఉన్నప్పుడే నల్లగొండ ఇంచార్జ్ గా ఉండి పరిశ్రమల నుండి భారీగా కోట్లలో లంచాల రూపంలో తీసుకొని వరంగల్ లో బహుళ అంతస్తుల భవనం నిర్మించిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడి నుండి మొదలైన తన అవినీతి సామ్రాజ్యం అడ్డుఅదుపు లేకుండా సాగుతూ పోతున్న సమయంలో సంగారెడ్డి ఇఇ గా ఉన్నప్పుడు అనేక బినామీ పేర్లతో అక్రమస్తులను సంపాదించడంలో తారాస్థాయికి చేరింది. సంగారెడ్డి ఇఇ గా పని చేస్తున్న సమయంలోనే ఈయనగారి అవినీతికి అంతులేకుండా పోతుందని తెలుసుకున్న అప్పటి పిసిబి మెంబర్ సెక్రెటరీ సత్యనారాయణ రెడ్డి సస్పెండ్ చేసేదాక పోతే ఓ ప్రజాప్రతినిధిని పట్టుకొని పైరవీ చేసుకొని మళ్ళీ ఎలాగో అలాగా సస్పెన్షన్ దాకా వెళ్ళిన దాన్ని బదిలీగా మార్పించుకొని నిజామాబాద్ ఇఇ గా పోస్టింగ్ ఇప్పించుకున్నాడు. ఈయన గారి స్థానంలో నిజాయితీపరుడైన సిన్సియర్ అధికారి భధ్రగిరీష్ కు బాధ్యతలు అప్పగించి అక్కడ పరిస్థితిని చక్కపెట్టడం జరిగింది. ఇది ఇలా ఉంటే.. ఇంత జరిగిన ఇఇ బిక్షపతి నిజామాబాద్ ఆర్ఒ కు పోయినక అయిన మారిండా అంటే అదీ లేదు.. కుక్క తోక వంకరే అన్నట్లు అక్కడ కూడా అవినీతి వసుళ్లే. అంతే కాదండోయ్ ఈయన గారు చేస్తున్న అవినీతి సరిపోక మొన్నఈ మధ్య జరిగిన పిసిబి అధికారుల బదిలీలలో కూడా మంచి ఆర్ఒ కావాలని ప్రయత్నం కూడా చేశాడని వినికిడి. ప్రస్తుత మెంబర్ సెక్రెటరీ ఈయన గారి అవినీతిలీలలను ముందుగానే తెలుసుకొని రామగుండం ఆర్.ఒ.కు బదిలీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం రామగుండం ఇఇ గా పనిచేస్తున్న బిక్షపతి ఇక్కడ కూడా అవినీతి విషయంలో చాలా ముందున్నడు. కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం దేవుడెరుగు కానీ ఈయన గారి అవినీతికి మాత్రం అంతం అనేది లేకుండా పోతుంది. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామం, రామగిరి మండలంలో స్టోన్ క్రషర్స్ సైటింగ్ గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా రాజీవ్ రహదారికి 100 మీటర్ల లోపల ఉన్నాయని అక్కడ ఉండే కంచర చెరువు కలుషితం కావడమే కాక వారు చేసే బ్లాస్టింగ్ వల్ల మరియు పొల్యూషన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదులను పట్టించుకోకుండా పక్కనపెట్టి స్టోన్ క్రషర్స్ యాజమాన్యాలతో కుమ్మక్కై లక్షల రూపాయలను లంచాల రూపంలో తీసుకున్నాడు అని ఫిర్యాదుదారులు తెలపడమే కాక ఈ విషయాన్ని జోనల్ కార్యాలయం, హైదరాబాద్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు క్రషర్స్ యాజమాన్యాలతో కుమ్మక్కై లంచాలకు అమ్ముడు పోయారని ఫిర్యాదుదారులు తెలిపారు. అయినా జోనల్ కార్యాలయం, హైదరాబాద్ అధికారుల పనితీరు ఎలా ఉంటదో మనకు తెలియనిది కాదు కదా..! ఇక్కడ ఓ ఇద్దరు అవినీతి అధికారుల రాజ్యమే నడుస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే. ఆ ఇద్దరి అధికారుల పనితీరు.. వారి నిజాయితీ ఎలా ఉంటదో త్వరలో ఇంకో కథనంలో చెప్పుకుందాం. పాలకుర్తి, రామగిరి మండలాల్లో విచ్చల విడిగా పొల్యూషన్ చేస్తున్న స్టోన్ క్రషర్స్ యాజమాన్యాల ఆగడాలను తట్టుకోలేక ఇఇ రామగుండం, జోనల్ కార్యాలయం, హైదరాబాద్ అధికారుల అవినీతిని చూస్తూ ఉండలేక ఆ కాలుష్య బాధితులు కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ కి ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై మెంబర్ సెక్రెటరీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇఇ బిక్షపతి అక్రమ సంపాదన గురించి చెప్పాలంటే వింటే భారతం.. రాస్తే రామాయణం అంత ఉంది. ఈయన గారి అక్రమ సంపాదన, అక్రమస్తులపై ఏసీబీ అధికారులతో విచారణ చేస్తే వారే షాక్ అవుతారేమో.. ఈయన పనితీరు వల్ల పర్యావరణ విధ్వంసం ఎంతలా జరుగుతుంది..? అక్రమ వసూళ్ల కరోడ్ పతి ఇఇ బిక్షపతి అక్రమ సంపాదన ఎంత..? రాబోయే కథనంలో.. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ “మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం”…