- కాలుష్య పరిశ్రమలపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడం పక్కకు పెట్టి వసూళ్లు చేయడమే వీరి లక్ష్యమా..?
- గతంలో ఓ స్టోన్ క్రషర్ పై వచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి కఠిన చర్యలు లేవు..
- కారణం ఆ క్రషర్ యాజమాన్యంతో కుమ్మక్కై భారీగా ముడుపులు తీసుకున్నారని వినికిడి..
- ఇలాంటి ఎన్నో ఫిర్యాదులపై చర్యలు శూన్యం..
- సార్ ఏదైనా పరిశ్రమకు పోయిండు అంటే చాలు సరిపోను ఇవ్వాల్సిందే..
- సార్ కు నెలవారి ముడుపులు అందకపోతే పరిశ్రమలకు ఇబ్బందులే..
- మే నెలలో జరిగిన 2 గ్రానైట్స్ సంస్థల ప్రజాభిప్రాయ సేకరణకు సంబందించి భారీగా ముడుపులు అందినట్లు సమాచారం..
- సార్ పై గతంలో పనిచేసిన సంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్ ఆర్ఓలలో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలే..
- అవినీతి ఆరోపణలతో సస్పెండ్ దాకా వెళ్ళి వచ్చిన మారని సార్ తీరు..
- రామగుండం ఆర్ఓ అధికారిగా కూడా అనేక అవినీతి ఆరోపణలే..
- సార్ గారు అక్రమ సంపాదనతో భారీగానే బినామీ పేర్ల మీద అక్రమాస్తులు కూడబెట్టినట్లు విశ్వసనీయ సమాచారం..
- ఏదైనా పరిశ్రమపై ఫిర్యాదు చేద్దాం అని కాల్ చేస్తే ఫిర్యాదు తీసుకున్నాక.. ఆ ఫిర్యాదును అడ్డుపెట్టుకొని సదరు పరిశ్రమ వారిని బెదిరించి ముడుపులు బాగానే తీసుకుని అవి అందిన తరువాత ఫిర్యాదుదారుడు ఫిర్యాదు విషయమై కాల్ చేస్తే అతని నంబర్ బ్లాక్ లో పెట్టడం సార్ కు బాగా అలవాటు అని పలువురు చెపుతున్న మాట..
- ప్రభుత్వం ఇచ్చిన నంబర్ మాత్రమే కాక సర్ దగ్గర్ ఇంకా చాలా ప్రైవేట్ నంబర్లు ఉన్నాయని పలువురు చెబుతున్నారు.. సరే ఆ నంబర్లు ఎలాగూ ఎవరికి చెప్పరు. కానీ ప్రభుత్వం ఇచ్చిన నంబర్ ఆయినా ప్రజల కోసం వాడాలి కదా.. ఆ నంబర్ ను కూడా తనకు అనుకూలంగా వాడుకుంటూ ఫిర్యాదుదారుల నంబర్లను బ్లాక్ లో పెట్టే అధికారం ఈ అధికారికి ఎవరు ఇచ్చారని పలువురు పర్యావరణ వేత్తలు, మేధావులు, కాలుష్య బాధితులు ప్రశ్నిస్తున్నారు..
- ఈ సారు లీలలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. త్వరలోనే కొన్ని కండ్లు తిరిగే నిజాలతో సార్ అవినీతి బాగోతాలను పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకువస్తుంది మీ “నిఘా నేత్రం న్యూస్”.. అవినీతిపైనే మా సమరం.. ప్రతినిత్యం పేదోడి పక్షం..