సువెన్ ఫార్మా కంపెనీ మూసివేయాలి

* కంపెనీ ఎక్స్ పెన్ డేచర్ను నిలిపివేయాలి..
* పొల్యూషన్ అధికారులు పట్టించుకోవడం లేదు..
* నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి, ప్రజలకు వసతులు కల్పించాలి..

సువెన్ ఫార్మా కంపెనీని మూసివేయాలని గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు రాములు నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సువెన్ ఫార్మా కంపెనీ బాధితులు పలువురు మాట్లాడుతూ సువెన్ ఫార్మా కంపెనీ చుట్టుపక్కల ఆవాస వార్డులైన 5, 6, 18 వార్డులలో ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కంపెనీ వలన ప్రజలకు శ్వాసకోస, కిడ్నీ, గుండె జబ్బులు వస్తున్నాయని. వాతావరణం అంతా కాలుష్యమై కంపెనీ యొక్క వ్యర్ధ జలాలను రాత్రిపూట తమ చుట్టుపక్కల పొలాలలో వదులుతూ, ప్రజలకు హాని చేసే విధంగా కంపెనీ వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ కంపెనీ పైన ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరూ కూడా స్పందించడం లేదని ఆగ్రహ వ్యక్తం చేశారు. ప్రజలకు ఆరోగ్య రక్షణ కింద సిఎస్ఐఆర్ నిధుల నుంచి పది లక్షల రూపాయలను ఇచ్చే విధంగా మేము అడిగితే మాపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 23 టీఎంపి ఉన్న కంపెనీనీ, ప్రస్తుతం 250 టీఎంపీకి పెంచారని దీనికి అనుమతులు ఎలా వచ్చాయని, 23 టిఎంపి ఉంటేనే పొల్యూషన్ ఇంత ఎక్కువగా ఉంటే, అదే 250 టిఎంపి పెంచితే జిల్లా అంత స్మశానమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాజకీయ నాయకులకు అనేక సార్లు విన్నవించిన గిరిజన ప్రజల మీద ఏమాత్రం దయ చూపకపోవడంతో పాటు, ఈ సమస్య మీద ఎవరు పోరాడితే వాళ్లని బెదిరించి జైల్లో పెట్టిస్తున్నారని తెలిపారు. సువెన్ ఫార్మా కంపెనీ యొక్క పిఆర్ఓ రాములు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, పోలీసులను చెప్పు చేతల్లో పెట్టుకొని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సువన్ కంపెనీ మూసివేసే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు. ఓ బాధిత మహిళ మాట్లాడుతూ సువెన్ ఫార్మా కంపెనీ నుండి వెలువడే విషవాయువుల వల్ల, 15 సంవత్సరాలుగా తన ఆరోగ్యం బాగోలేదని, హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ లో లక్షలు రూపాయలు ఖర్చు అయ్యాయని అన్నారు. కంపెనీ చుట్టుపట్టు ఉన్న తండాలలోని గర్భిణీ మహిళలకు పిల్లలు సరిగా పుట్టడం లేదని, ఆ భయంతోనే నా కొడుకు, కోడలు నన్ను వదిలి హైదరాబాద్ వెళ్లి అక్కడే ఉంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తండాలోని 70 శాతం మందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఏ ఒక్క నాయకుడు కానీ మమ్మల్ని పరామర్శించింది లేదన్నారు. మరో బాధితుడు దరవత్ చాంప మాట్లాడుతూ 2017 నుండి ఇప్పటివరకు సువెన్ ఫార్మా కంపెనీపై పోరాటం చేస్తున్నానే ఎన్నో మార్లు ప్రభుత్వ కార్యాలయంలో ఈ కంపెనీపై ఫిర్యాదులు చేసామని ఆయన ఎలాంటి చర్యలు లేవని ఆగ్రహ వ్యక్తం చేశారు. అధికారులు, నాయకుల పబ్బం గడపడం కోసం మా గిరిజన బతుకులను ఆగం చేస్తున్నారని, ఎవరు పట్టించుకోకపోవడంతో చనిపోవడం కోసం మానవ హక్కుల కమిషన్ కి త్వరలో అప్లికేషన్ పెట్టుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర శరత్ నాయక్, గిరిజన మహాశక్తి రాష్ట్ర అధ్యక్షుడు చందర్ నాయక్, సేవాలాల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్, సేవలల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేఖ నాయక్, నాగేందర్ నాయక్, సురేష్ నాయక్, రమవత్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

శంకర్ నాయక్ సువెన్ ఫార్మా బాధితుడు
సువెన్ ఫార్మా కంపెనీ నుండి వెలువడుతున్న విష వాయువుల కారణంగా స్థానిక తండా వాసులు పడుతున్న ఇబ్బంది గూర్చి, సామాజిక మధ్యమాలలో పోస్టులు పెట్టిందుకు గత సంవత్సరం క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ రోడ్ లో నా భార్యతో (9 నెలల గర్భవతి) కలిసి కూరగాయలు కొంటుండగా, చివ్వెంల ఎస్.ఐ పి. విష్ణుమూర్తి సాయంత్రం ఏడు గంటల సమయంలో ఓ ప్రైవేటు వాహనంలో మఫ్టీలో వచ్చి, నన్ను బెదిరింపులకు గురిచేసి, మా కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి వాహనంలో ఎక్కించుకొని స్టేషన్ కి తీసుకెళ్లి అక్రమంగా కేసు నమోదు చేసి, అదే రోజు రాత్రి జడ్జి ముందు హాజరు పరిచి తెల్లారేసరికి జైల్లో రిమాండ్ చేశారు. నేను ఏ తప్పు చేయకున్నా, సామాజిక మధ్యమాలలో పోస్టులు పెడుతున్న కారణంగా వివిధ రకాల కేసులను బనాయిస్తూ నక్సలైట్ మాదిరి గా నాపై వ్యవహరించాలని అవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు జిల్లా మంత్రి స్పందించి అక్రమ కేసులు బనాయిస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.