మైహెూమ్ సిమెంట్స్ పరిశ్రమ పబ్లిక్ హియరింగ్

సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలంలోని మైహెూమ్ సిమెంట్స్ పరిశ్రమ విస్తరణకు సంబంధించి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గురువారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. మై హెూమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వ ర్యంలో మఠంపల్లి మండలంలోని చౌటుపల్లి గ్రామ పరిధి లోని సున్నపు రాయి గని ఒకటి, రెండుతో పాటు మేళ్ల చెర్వులోని మహా సిమెంట్స్ నాలుగవ యూనిట్ సామర్ధ్యం విస్తరణపై మొత్తం మూడు భాగాలుగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా చౌటుపల్లిలోని మైహెూమ్ సిమెంట్స్ ఇండస్ట్రీలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ పబ్లిక్ హియరింగ్లో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఆర్డీవో జగదీశ్ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారి ప్యానెల్ గా ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు నిరాటంకంగా ప్రజాప్రభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో సమీప గ్రామాల సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీ లు, జెడ్పి టిసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు, పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు వివిధ సంస్థల ప్రతినిధులతో సమీప గ్రామాల ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇందులో మొత్తం 80 మంది తమ అభిప్రాయాలను మౌఖికంగా వెల్లడించగా, చాలామంది రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. మరికొందరు ఇప్పటికే తమ కార్యాలయానికి నేరుగా అభిప్రాయాలను పంపించినట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. స్థానికంగా మై హెూమ్ పరిశ్రమ వచ్చిన తర్వాత తమ ప్రాంతం చాలా అభివృద్ధి చెందిందని, ఆపత్కాల సమయంలో ఎవరు వచ్చినా తామున్నామంటూ పరిశ్రమ యాజమాన్యం ఆదుకుంటుందని పబ్లిక్ హియరింగ్ పాల్గొన్న అత్యధిక మంది స్థానికులు తమ అభిప్రాయాన్ని సభా ముఖంగా వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మై హెూమ్ పరిశ్రమ తరుపున ఆపరేషన్స్ జీఎం రామ్మోహన్ రావు సమాధానం ఇచ్చారు. తాము ఎప్పుడూ స్థానికులకు అందు బాటులో ఉంటున్నామని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తమను నేరుగా సంప్రదించాలని, కొంతమంది చేసిన వినతులు ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించినవని, వాటి పై ప్రభుత్వం ముందుకు వస్తే తాము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. 80 శాతం మంది తెలంగాణ వారే పని చేస్తున్నారని, స్థానిక మండలాల వారు, జిల్లా కు చెందిన వారు దాదాపు సగం మంది పని చేస్తున్నారని రామ్మోహన్ రావు గణాంకాలతో సహా వివరించారు. ఏ చిన్న అవకాశం లభించినా ఉద్యోగ కల్పనలో స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. స్వచ్చాయుత వాతావరణం లో ప్రజాభిప్రాయ సేకరణకు భారీగా ప్రజలు హాజరు కావడం, మై హెూం సంస్థ తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆనందం వ్యక్తం చేయడంతో కలెక్టర్ వెంకట్రావు కూడా మైహెూమ్ సిమెంట్స్ యాజమాన్యాన్ని అభినం దించారు. దాదాపు అందరూ పరిశ్రమ పట్ల సానుకూలంగా అభిప్రాయాలను వెల్లడించారని కలెక్టర్ వెంకట్ రావు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభిప్రాయా లను అన్నింటినీ క్రోడీకరించి కేంద్ర పర్యావరణ శాఖ కు పంపుతామని అధికారులు తెలిపారు.