- కాలుష్య నియంత్ర మండలి ప్రధాన కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోస్టర్ ను ఆవిష్కరించిన టిఎస్ పిసిబి మెంబర్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య IAS.
- యువత బాధ్యతగా భావించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.. అనే నినాదంతో ప్రతీ ఒక్కరూ రాబోయే వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని టిఎస్ పిసిబి మెంబర్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య IAS పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కాలుష్య నియంత్ర మండలి ప్రధాన కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టిఎస్ పిసిబి మెంబర్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య IAS గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రకృతిహితమే పండగల పరమార్థం అన్నారు. పండుగలతో సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిదే అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిచ్చి భవిష్యత్ తరాలకు స్వచ్చమైన గాలి, నీరు, వాతావరణంను అందిద్దాం అని పిలుపు నిచ్చారు. వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిళ్లుతోంది. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదన్నారు. ఈ చిన్న విషయాన్ని యువత అర్థం చేసుకుంటే చాలు అన్నారు. మట్టి గణపతి కోసం ప్రతీ ఒక్కరూ గట్టి సంకల్పం తీసుకోవాలని కోరారు.
పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ
టిఎస్ పిసిబి సహకారంతో పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు. అంతేకాక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు టిఎస్ పిసిబి అధికారులు తెలిపారు.