“పర్యావరణ పరిరక్షణ సమితి” అధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

  • మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం..
  • మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన పెంపొందించేలా చర్యలు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో పర్యావరణ పరిరక్షణ సమితి అధ్వర్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేశారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుంటూ.. తెలంగాణాను పర్యావరణ హితంగా తీర్చిదిద్దుకుందామని పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు పిలుపునిచ్చారు. పీఓపీ విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు కలుషితం అవుతుందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని కోరారు. ఈ పండుగలు, పూజలు ప్రజాహితం కోసమేనని, వాటి పేరుతో పర్యావరణం కలుషితం చేయకుండా చూడాలన్నారు.

గణపతి మట్టి విగ్రహాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిచేందుకు పర్యావరణ పరిరక్షణ సమితి వారు ముద్రించిన గొడపత్రిక మరియు పంప్లెట్ ను తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య IAS ఆవిష్కరించారు. వినాయక చవితి ఉత్సవాల్లో పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యతనిచ్చి భవిష్యత్ తరాలకు స్వచ్చమైన గాలి, నీరు అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్వర్యంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అందరికీ మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నామన్నారు.