జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలోని శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. దీనివల్ల ఎవరికీ ప్రాణ, ఆస్తి నష్టం కలుగలేదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. పరిశ్రమలోని ఆరో బ్లాకులో రసాయనాల రాపిడి వల్ల ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న వారు పరుగులు తీశారు. తరువాత తేరుకొని ఫోమ్, ఇసుక ఇతర రసాయనాలు, నీళ్లు చల్లి మంటలు నివారించారు. ఇతర పరిశ్రమల నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు సైతం మంటలు ఆర్పడానికి సహకరించాయి. ప్రమాద ఘటనపై విచారణ చేస్తామని ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లక్ష్మీకుమారి పేర్కొన్నారు.