సంగారెడ్డి PCB పరిధిలోని పరిశ్రమల్లో అధికారుల తనిఖీలు

  • ఇలాంటి ఎన్ని తనిఖీలు జరిగిన లాభం లేదంటున్న పొల్యూషన్ బాధితులు
  • సంగారెడ్డి పరిధిలో ఉన్న పరిశ్రమలపై అధికారుల చర్యలు తూ.. తూ.. మంత్రమే అంటున్న బాధితులు
  • ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోని సంగారెడ్డి PCB అధికారులు
  • దీనికి కారణం సంగారెడ్డి PCB EE మరియు AEEల అవినీతే అంటున్న పొల్యూషన్ బాధితులు, పర్యావరణ వేత్తలు..
  • సంగారెడ్డి PCB పరిధిలో జరుగుతున్న అవినీతి బాగోతాలపై త్వరలో పూర్తి ఆధారాలతో మరింత సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది.. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం…

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పర్యావరణానికి హాని తలపెట్టే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని PCB టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. హత్నూర మండలం గుండ్లమాచనూర్ పంచాయతీ పరిధిలోని కోవలెంట్ లేబొరేటరీస్, హానర్ ల్యాబ్, ఆపిటోరియా యూనిట్ -3 పరిశ్రమల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వరంగల్ NIT ప్రొఫెసర్ డాక్టర్ పి. శ్రీధర్, కూకట్ పల్లి JNTU ప్రొఫెసర్ లక్ష్మీపూజ, సంగారెడ్డి PCB EE గీతా సపారె, AEEలు శ్రవణ్, భాగ్యలక్ష్మిలతో కూడిన అధికారుల బృందం ముందుగా కోవలెంట్ పరిశ్రమను సందర్శించింది. ఆ పరిశ్రమల చుట్టుపక్కల పరిసరాలు, పరికరాలను పరిశీలించారు. భద్రతాపరమైన లోపాలను సవరించుకోవాలని సూచించారు. హానర్ ల్యాబ్, ఆపిటోరియా యూనిట్-3 పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్ని పరిశీలించారు. ఆ పరిశ్రమల రసాయన జలాల నమూనాల్ని సేకరించి తదుపరి పరీక్షల నిమిత్తం PCB సెంట్రల్ ల్యాబ్ కు పంపి ఫైనల్ రిపోర్ట్ లను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు వివరించారు.

గతంలో కూడా ఇలాంటి తనిఖీలు చాలానే జరిగాయి అయిన కూడా ఇక్కడి పరిశ్రమల్లో ఎటువంటి మార్పు లేదు. దీనికి ప్రధాన కారణం పొల్యూషన్ పరిశ్రమలపై ఎన్ని ఫిర్యాదులు చేసిన కూడా సంగారెడ్డి PCB EE, AEEలు పరిశ్రమల వారితో కుమ్మక్కై విచ్ఛలవిడి అవినీతికి పాల్పడుతూ పట్టించుకొకపోవడం.. పరిశ్రమల వారి నుండి అనేక రకాల లబ్ధి పొందుతూ మా పొల్యూషన్ బాధలను పట్టించుకోవడం మానేశారని వాపోతున్న పొల్యూషన్ బాధితులు.

పొల్యూషన్ బాధితుల బాధలను.. పర్యావరణ వేత్తల అభిప్రాయాలను.. సంగారెడ్డి PCB పరిధిలో జరుగుతున్న అవినీతి బాగోతాలపై త్వరలో పూర్తి ఆధారాలతో మరింత సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం…