- చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రైతుల అరిగోస..
- విషమంగా మారిన పంట పొలాలు.. ప్రజల ఆరోగ్యం..
- కాలుష్యం కారణంగా 30 ఏళ్లలో వందల మంది మృతి..
- ప్రజలకు అండగా నిలబడని ప్రజాప్రతినిధులు..
- సువెన్ ఫార్మాకి అవినీతి అధికారుల అండదండలు..
- సువెన్ ఫార్మా ఇచ్చే లక్షలకు లక్షలు మింగుతున్న అవినీతి అధికారులు…
సూర్యాపేట జిల్లాకి సువెన్ ఫార్మా కంపెనీ సైనేడ్ గా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో చాలా ఏళ్ల పాటు పోరాటం చేసి, ఎన్నో ప్రభుత్వాలు మారిన, ఎంతోమంది నాయకులు మారిన ఫ్లోరైడ్ సమస్య పోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు సూర్యాపేటను ఫ్లోరైడ్ సమస్య లేని జిల్లాగా మార్చేందుకు స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి కృషి చేశారు. కానీ సువెన్ ఫార్మా గత మూడు దశాబ్దాలుగా చుట్టూరా ఉన్న గ్రామాలలోని పంట పొలాల దగ్గర నుండి పశువులు, చెట్లు చివరికి మనషులు కూడా పెద్ద సంఖ్యలో మృత్యువాత పడగా, వివిధ రోగాలతో కొందరు మంచాలు పట్టగా, మరికొందరు హాస్పటల్ చుట్టూ తిరుగుతున్నారు. సాధారణ మరణంతో చనిపోయిన వారి కంటే సువెన్ ఫార్మా నుండి వెలువడుతున్న విషవాయులు, కలుషితం అయిన నీళ్ళ ద్వారా మంచాలు పట్టిన వారే ఈ చుట్టుపట్టు ఉన్న గ్రామాలలో కనిపిస్తుంటారు. ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు పేషెంట్లు ఉన్నారంటే అది సువెన్ ఫార్మా పుణ్యమే అనే చెప్తున్నారు. తండావాసులు ఈ ఫార్మా కంపెనీ వల్ల భూముల విలువ కూడా తగ్గిందని, మరి కొన్ని రోజులు పోతే చుట్టుపక్కన గ్రామాలు, తండాలు కూడా శ్మశానంగా మారతాయంటున్నారు.
ఫార్మా కంపెనీలో సరైన జాగ్రతలు తీసుకోలేదు.. అధికారులు..
ఫార్మా కంపెనీలో తనిఖీకి వెళ్లిన అధికారులకు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కొందరు సిబ్బందికి సేఫ్టీకి ఎలాంటి జాగ్రత్తలు షూట్, హెల్మెట్, బ్లౌస్, షూ లు లేవని గుర్తించారు. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు సిబ్బంది ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుందని అన్నారు. అలాగే కంటైనర్ వద్ద ఏర్తింగ్ సరిగా లేదని అధికారులు గుర్తించారు. రియాక్టర్ పక్కనే వాషింగ్ చేస్తున్నారని, ఆ పని స్థలం విశాలంగా ఉన్న ప్రాంతంలో (బయట వైపు) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నైట్రోజన్ ఎట్మాస్పియర్ ట్రాన్స్ఫర్ చెయ్యాలని అల చేసే క్రమంలో ఫైర్ అవుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వాళ్ళు ఏం కెమికల్స్ తో పనిచేస్తున్నారు. అలా పని చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలపై పలు సూచనలు చేశారు. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలని కంపెనీ యాజమాన్యానికి నోటీస్ ఇచ్చారు సంబంధిత శాఖ అధికారులు.
సువెన్ ఫార్మా ఇచ్చే లక్షలకు లక్షలు మింగుతున్న అవినీతి అధికారులు..
గత మూడు దశాబ్దాలుగా సూర్యాపేట జిల్లాకు శాపంగా మారిన సువెన్
ఫార్మా కంపెనీ.. దీని మూలంగా ప్రజలకు ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతున్న కంపెనీపై ఎంతో మంది రైతులు, ప్రజలు ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. ఈ సెవెన్ ఫార్మా కంపెనీ వల్ల విషమంగా మారిన నీళ్లు, హాస్పిటల్ బెడ్ లు ఎక్కిన తండాల పేద ప్రజలు తప్ప, బాగుపడిన గ్రామాలు ఏమాత్రం లేవు. కానీ ఈ కంపెనీ పేరు మీద కుల సంఘాల నాయకులు, అవినీతి అధికారులు లక్షలకు లక్షలు మింగుతున్నరని, ఫార్మా కంపెనీ బాధితులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అందుకే ఎన్ని ఫిర్యాదులు అందిన, కోర్టులో ఎన్ని కేసులు వేసినా ఫార్మా కంపెనీ విస్తరణ జరిగింది తప్ప, మూతపడటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై జిల్లా ఉన్నతధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు..(సోర్స్: ఆదాబ్ హైదరాబాద్)