పటాన్‌చెరు పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. నలుగురు సిబ్బందికి గాయాలు

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. పటాన్‌ చెరు మండలం పాశమైలారంలోని ఆదిత్య కెమికల్‌ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరుగగా క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో నలుగురు ప్యాక్టరీ సిబ్బందికి, ఇద్దరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.