తెలంగాణలో మైనింగ్, పిసిబి, ఈసీ కమిటీ అధికారులు ఉన్నారా…?

  • జనవాసంలకు దగ్గరలో బ్లాస్టింగ్ లకు పర్మిషన్ ఎవరిచ్చారు.. ?
  • ప్రకృతి సంపద గుట్టలు మాయం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు..?
  • అడ్డగోలు మైనింగ్ చేస్తుంటే పర్మిషన్ లు ఎలా ఇస్తున్నారు..?
  • అధికారులకు ముడుపులు అందితే అడ్డదిడ్డంగా పర్మిషన్ ఇస్తారా..?
  • ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయలను ఎందుకు పట్టించుకోవట్లేదు..?
  • ప్రాణాలు పోయిన, ఎవరికి నష్టం జరిగిన మాకు సంబంధం లేదంటున్న సంబంధిత అధికారులు..

తెలంగాణలో అసలు మైనింగ్, పిసిబి, ఈసీ కమిటీ అధికారులు ఉన్నారా..? పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులు అవినీతికి అలవాటు పడి అడ్డగోలు పర్మిషన్లు ఇవ్వడం వల్ల అవినీతి అధికారుల పుణ్యమాని ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న స్టోన్ క్రషర్ల, రియల్ ఎస్టేట్ సంస్థలు, మైనింగ్ లతో మా బతుకులు అగమవుతున్నాయని నెత్తినోరు కొట్టుకొని చెబుతున్నా ఈ అవినీతి అధికారులకు పట్టడం లేదని తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో పొల్యూషన్ తో బాధపడుతున్న ప్రజలు చెప్తున్న మాట.

ప్రకృతి సంపద అయిన గుట్టలను మాయం చేస్తూ అడ్డగోలు ధనార్జనకు అలవాటు పడి మేం ఏం చేసిన అడిగేవాడే లేడనే ధైర్యంతో మైనింగ్ యాజమాన్యాలు ఇష్టరీతిగా మాట్లాడుతున్నారు. వారిని అడగాల్సిన సంబంధిత శాఖల అధికారులు మేం విసిరే ఎంగిలి మెతులకు ఆశపడి మేం ఏం చేసిన ఎంత విధ్వంసం చేసిన వెన్నుదన్నుగా నిలిచే అవినీతి అధికారులు ఉన్నంత కాలం మాకు అడ్డే ఉండదని మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని చాలా చోట్ల క్రషర్, మైనింగ్ యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని తెలంగాణ వ్యాప్తంగా చాలా గ్రామాలు, తండాలలో అమాయకపు ప్రజలు వాపోతున్నారు.

ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తున్న.. అడ్డగోలు కాలుష్యం చేస్తున్న మైనింగ్ సంస్థలు, క్రషర్ల బారి నుంచి కాపాడాల్సిన మైనింగ్ అధికారులు, పొల్యూషన్ కట్రోల్ బోర్డు అధికారులు, ఈసీ కమిటీ వారి సంపాదనలో భాగమై వారికి కావల్సినంత లంచాల రూపంలో తీసుకుంటూ ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.

క్రషర్ల నుంచి వెలువడే వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యంతో తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల మా ఊర్లు ఆగమైపోతున్నాయని వాపోతున్నారు. క్రషర్లు గ్రామస్తులు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. క్రషర్లతో అన్నదాతలు పంటల సాగుకు దూరం అవుతుండగా, క్రషర్ల బాంబుల మోతలకు ఇండ్లు ధ్వంసమై ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. క్రషర్ల ద్వారా వ్యాపిస్తున్న దుమ్ము ధూళితో గ్రామంలో రైతులు పంటలకు స్వస్తి పలికే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. వందలాది లారీలు తిరుగుతుండడంతో పెద్ద ఎత్తున దుమ్ము పంటలపై వ్యాపించడంతో పంటలు పండటం లేదని తెలిపారు. దానికి తోడు క్రషర్ల దుమ్ముతో గ్రామాల్లో ప్రజలు శ్వాశ సంబంధిత వ్యాధులతో పాటు అనేక రకాలైన అనారోగ్యల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పొల్యూషన్ కట్రోల్ బోర్డు అధికారులు, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చెవిన పెట్టలేదని వారి తీరు వల్లనే మా బతుకులు ఆగమయ్యాని చెప్పారు.

ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయలను పట్టించుకోవట్లేదు..

క్రషర్ల కాలుష్యాన్ని నివారించాలని ప్రజలు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం, అవినీతి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే ఉన్న క్రషర్లతో తాము అవస్థలు పడుతున్నామని తెలిసిన అవినీతి అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు ఉన్నవి సరిపోవన్నట్లు, భారీ మొత్తంలో లంచాలు తీసుకుంటూ అడ్డ దారిలో కొత్త వాటికి అనుమతులు ఇస్తూ తమ గ్రామస్ధుల జీవితాలను అస్తవ్యస్తంగా మారుస్తున్నారని వాపోయారు. మైనింగ్, క్రషర్ల ఏర్పాటుకు జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో ముక్తకంఠంతో తామంతా క్రషర్ల ఏర్పాటును వ్యతిరేకించిన మైనింగ్ డిపార్ట్ మెంట్, ఈసీ కమిటీ, పొల్యూషన్ కట్రోల్ బోర్డులోని కొంతమంది అవినీతి అధికారులు మాత్రం యాజమాన్యాలకు కొమ్ముకాస్తూ మా గ్రామాలను వల్లకడుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాక మైనింగ్ డిపార్ట్ మెంట్, పొల్యూషన్ కట్రోల్ బోర్డు, ఈసీ కమిటీలోని ఛైర్మన్, కార్యదర్శి, కమిటీ మెంబర్ల అవినీతి బాగోతలను పేర్లతో సహా త్వరలోనే బయట పెడతామని విజిలెన్స్ మరియు ఏసీబీ అధికారులకు వీరిపై రాతపూర్వక ఫిర్యాధులు చేస్తామని చెబుతున్నారు. మైనింగ్ డిపార్ట్ మెంట్, పొల్యూషన్ కట్రోల్ బోర్డు అవినీతి ఒక ఎత్తైతే ఈసీ కమిటీ అవినీతి బయటకు కనపడని భారీ అవినీతి అని నాలుగు గోడల మధ్య కూర్చొని ప్రజాభిప్రాయ సేకరణలో ఏం జరిగిందో కూడా చూడకుండా.. ప్రజల బాధలను పట్టించుకోకుండా చాలా చోట్ల మైనింగ్ లకు వ్యతిరేకంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు రాస్తారోకోలు చేసిన వీరికి కనపడనట్లు.. అసలు ఈసీ కమిటీ ఒకటి ఉంటదనే విషయమే మైనింగ్ క్రషర్ యజమాన్యలకు కొద్దిమందికి తప్ప చాలా మంది అమాయకపు ప్రజలకు తెలవదు కాబట్టి ప్రజల బాధతో మాకు సంబంధం లేనట్లు ప్రవర్తిస్తూ.. భారీ ఎత్తున లంచాలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా అడ్డగోలు అనుమతులు ఇచ్చారని వీరిపై ఏసీబీ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేస్తే భారీ తిమింగలలు దొరుకుతాయని వీరి అవినీతి మూలంగా మా జీవితలే కాకుండా మా పిల్లల జీవితాలు, పుట్టబోయే పిల్లల జీవితాలు కూడా ఆగమైతున్నాయి అని వాపోతున్నారు.

క్రషర్ల ద్వారా జరుగుతున్న ప్రకృతి విధ్వంసం, జీవన విధ్వంసంపై ఎన్నిసార్లు మేము మొరపెట్టుకున్న ఈసీ కమిటీ, మైనింగ్, పిసిబిలోని అవినీతి అధికారులకు చిత్తశుద్ధి లేదని వారి అసలు రూపాలు.. నిజస్వరూలు త్వరలో బయటకు తెస్తామని అందుకు మేధావులు, పర్యావరణ వేత్తలు సహకరించాలని కోరారు.