మొక్కలకున్న ఆ ‘సత్తా’ చాలా ఎక్కువ

మానవాళికి మొక్కలు చేసే మేలు అందరికీ తెలిసిందే. వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను మొక్కలు స్వీకరించడం వల్ల వాతావరణ మార్పుల వేగం తగ్గుతుంది. అయితే మొక్కలు కార్బన్‌ డయాక్సైడ్‌ను స్వీకరించే సత్తా ఇప్పటి వరకు అంచనా వేసిన దాని కన్నా ఎక్కువ అని తాజా అధ్యయనం వెల్లడించింది.

మొక్కలు స్వీకరించిన కార్బన్‌ డయాక్సైడ్‌ను బయోమాస్‌గా నిల్వ చేస్తాయని తెలిసింది. మొక్కలు, నేలలో కార్బన్‌ నిల్వ ఉంచడటం వల్ల వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ పెరుగుదల తగ్గుతుంది, తద్వారా ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా తగ్గుతుంది. ‘సైన్స్‌ అడ్వాన్సెస్‌’జర్నల్‌లో ఈ వ్యాసం ప్రచురితమైంది.