బిగ్‌ బ్రేకింగ్‌.. డీజీపీ అంజనీకుమార్‌ సస్పెండ్‌

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ (Anjani Kumar)పై ఈసీ (Election Commission) సస్పెన్షన్‌ వేటు వేసింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న కారణంతో అంజనీ కుమార్‌ను ఈసీ సస్పెండ్‌ చేసినట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతన్ను సమయంలో అనూహ్యంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని అంజనీ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఐపీఎస్‌ అధికారులు మహేశ్‌ భగవత్‌, సంజయ్‌ కుమార్‌తో కలిసి రేవంత్‌ ఇంటికి వెళ్లిన డీజీపీ టీపీసీసీ చీఫ్‌కు పుష్ఫగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో వీరు రేవంత్‌ను కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. మహేశ్‌ భగవత్‌, సంజయ్‌ కుమార్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపాయి.