గజ్వేల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఘన విజయం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌ రావు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్తి ఈటల రాజేందర్‌పై 45,174 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తూమ్‌కుంట నర్సారెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.