కేసీఆర్‌ రాజీనామాకు గవర్నర్‌ ఆమోదం.. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరిన తమిళిసై

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇచ్చిన రాజీనామా లేఖకు గవర్నర్‌ తమిళసై ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఈ సందర్భంగా కేసీఆర్‌కు గవర్నర్‌కు సూచించారు.