తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం

 బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు, ఎమ్మెల్సీ కవిత తదితరులు హాజరయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయం సాధిస్తామనుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీకి అనూహ్య పరాజయం ఎదురైంది. మొత్తం 119 స్థానాలకుగాను 39 స్థానాల్లో గెలిచి అధికారానికి దూరమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు కేటీఆర్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.