పాత టైర్ల సుంచి నూనె తీసే పరిశ్రమ యజమానులు పర్యావరణ సంబంధమైన కట్టు బాట్లు విధిగా పాటించాలి. ఈ పరిశ్రమలు కాలుష్య కారకులైతే వారి మీద గట్టి చర్యలు తప్పవు. దుర్గంధం సమస్య ఈ పాత టైర్ల నుంచి నూనె తీసె పరిశ్రమల్లో ఎక్కువగా ఉంది. దీన్ని అరికట్టడానికి సాంకేతిక పరిఙ్ఞానము ఇప్పటికే అందుబాటులో వుంది. దాన్ని అవలంభించాల్సిందిగా పిసిబి సభ్యకార్యదర్శి కృష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 47 పరిశ్రమలున్నాయి. అందులో 24 సంగారెడ్డి, 9 నల్లగొండలోను కేంద్రీకృతమై ఉన్నాయి. వీటినుంచి వచ్చె కాలుష్యంపై ఫిర్యాదులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవుతున్న దృష్ట్యా ఈ సమావేశము నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిఙ్ఞాన్ని వాడి పాత టైర్ల పరిశ్రమల వారు కాలుష్య నియంత్రణ చేయల్సిన అవసరం ఉంది అన్నారు. దీనికి కాలుష్య నియంత్రణ మండలి తగిన మార్గ దర్శకాలు ఇచ్చినది.
ఈ సమావేశంలో సాంకేతిక అంశాల మీద విశదీకరించిన వారు పిసిబి సినియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లు జనహర్ లాల్, ప్రసన్న రాణి మరియు నరేందర్ 47 మంది పారిశ్రామిక వేత్తలు పాల్గోన్నారు.