అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ని కలిసిన కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఉద్యోగులు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులు అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ని మర్యాదా పూర్వకంగా కలిశారు.
ఆనంతరం మంత్రి
కొండా సురేఖ మాట్లాడుతూ.. మన ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహంగా ఉంటుంది.. రాష్ట్ర ప్రజలందరికీ 6 గ్యారంటీలు అందించి తీరుతాం అని అన్నారు. మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని అన్నారు.. సమ్మక్క సారక్క జాతరలో ప్లాస్టిక్ కాలుష్యం లేకుండా చర్యలు తీసుకుంటాం. నాలాల్లో చెత్త పడేయకుండా ప్రజలలలో చైతన్యం అవసరం అని అన్నారు. ప్రజల సహాయంతో తెలంగాణలో కాలుష్య నియంత్రణ సాధిస్తాం. అవసరమైన చోట నేను కూడా స్వయంగా పాల్గొంటాను అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగుల డైరీకి మంత్రి కొండా సురేఖ సందేశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగ సంఘ కార్యనిర్వహక సభ్యులయిన కృపానంద్, శ్రీవాత్సవ, నరేందర్, గిసా స్వప్నలు మంత్రి కొండా సురేఖ ని కలిశారు.