అవినీతి ఆరోపణలు.. సైబరాబాద్‌లో ఇద్దరు సీఐలపై వేటు

 సైబరాబాద్‌ కమిషనరేట్‌ (Cyberabad) పరిధిలో మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై వేటుపడింది. మోకిలా పోలీస్‌ స్టేషన్‌ సీఐ, మొయినాబాద్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి (CP Avinash Mahanthi) సస్పెండ్‌ చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో మోకిలా సీఐ నరేశ్‌, మొయినాబాద్‌ సీఐ ఏవీ రంగను బదిలీచేస్తూ ఆదేశాలు జారీచేశారు.

ఈ నెల 28న కూడా ఇద్దరు సీఐలపై కమిషనర్‌ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌, ఆర్‌జీఐ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేశారు. కేపీహెచ్‌బీలో వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసినందుకుగాను ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌పై చర్యలు తీసుకున్నారు. భార్యాభర్తల వివాదంలో జోక్యం చేసుకున్న సీఐ వెంకట్‌ ఆ వ్యక్తిని చితకబాదారు. మరో కేసు విషయంలో కూడా సరిగా విచారణ చేయనందుకుగాను శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు.