రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీలు, వారికి వివిధ పోస్టింగ్‌లు కేటాయించింది. జిల్లా కలెక్టర్లతో సహా అన్ని స్థాయిల్లో 65 మంది ఐఏఎస్ అధికారలకు స్థానచలనం కల్పించింది. 21 జిల్లాల కలెక్టర్లతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. అలాగే పలువురు జూనియర్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. త్వరలోనే మరికొంత మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
కలెక్టర్ల బదిలీల వివరాలు :
సూర్యపేట కలెక్టర్‌గా టి. వినయ్ కృష్ణా రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్‌గా వి. వేంకటేశ్వర్లు, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా సిక్త పట్నాయక్, నిర్మల్ కలెక్టర్‌గా ముషారఫ్ అలీ, ములుగు జిల్లా కలెక్టర్‌గా ఎస్. కృష్ణ ఆదిత్య, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా వీపీ గౌతమ్, జగిత్యాల కలెక్టర్‌గా జి. రవి, జనగామ కలెక్టర్‌గా కె, నిఖిల, వనపర్తి జిల్లా కలెక్టర్‌గా, ఎస్.కె. యాస్మిన్ బాషా, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా ఎస్. వెంకటరావు, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్‌గా అబ్దుల్ అజీమ్, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శరత్, వికారాబాద్ కలెక్టర్‌గా పౌసుమీ బసు, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ఎం.వీ.రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా శ్రీదేవసేన, నారాయణపేట్ జల్లా కలెక్టర్‌గా హరిచందన దాసరి, హైదరాబాద్ కలెక్టర్‌గా శ్వేతా మహంతి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హన్మంతు, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా శృతిఓజా బదిలీ అయ్యారు.