ఇథనాల్‌ పరిశ్రమను రద్దు చేయాలని ప్రజలు, రైతులు బంద్‌ పిలుపు

నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలంలోని దిలావర్‌పూర్‌-గుండంపల్లి గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్‌ పరిశ్రమను రద్దు చేయాలని ప్రజలు, రైతులు బంద్‌కు పిలుపును ఇచ్చారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గురువారం దుకాణాలను బంద్‌ చేశారు. ఎటువంటి ఘటనలు జరుగలేదు. ఉదయం 9 గంటలకే గుండంపల్లి, దిలావర్‌పూర్‌, న్యూ లోలం గ్రామాలకు చెందిన దాదాపు 2 వేల మంది రైతులు, ప్రజలు జాతీయ రహదారి-61పైకి తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు ఎన్‌హెచ్‌ పక్కనే టెంటు వేసుకుని కూర్చున్నారు. పోలీసుల అనుమతితో వంటావార్పు చేసుకున్నారు. రహదారి పక్కనే కూర్చొని సహపంక్తి భోజనాలు చేశారు. ఆందోళన సమాచారాన్ని తెలుసుకున్న పో లీసులు అక్కడకు చేరుకున్నారు. దాదాపుగా 200 మంది బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం రైతులు, ప్రజలు ఇండ్లళ్లకు వెళ్లిపోయారు.

నేటి (శుక్రవారం) నుంచి పరిశ్రమ రద్దు చేసే వ రకు జాతీయ రహదారి-61 పక్కన శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేసేందుకు రైతులు కార్యాచరణ చేశారు. ప్రతి గ్రామం నుంచి 10 కు టుంబాలు నిత్యం రిలే నిరాహార దీక్షలో పాల్గొనే లా కార్యాచరణ రూపొందించారు. కాగా, మా ప్రాణాలు తీసే ఇథనాల్‌ పరిశ్రమ మా గ్రామంలో వద్దని కోరుతూ ఐదేండ్ల చిన్నారి తన కుటుంబ స భ్యులతో కలిసి వచ్చింది. జాతీయ రహదారిపై కూర్చొని భోజనం చేసి నిరసన తెలిపింది. అనంతరం రైతులు మాట్లాడుతూ తమ పొట్టగొట్టే పరిశ్రమను రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని తెలిపా రు. స్థానిక ఎమ్మెల్యేతోపాటు మాజీ మంత్రి తమ ఉద్యమానికి సంఘీభావం తెలపాలని కోరారు.

నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌-గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణ స్థలాన్ని బుధవారం ముట్టడించి.. గోడలు కూల్చివేసి, ఫర్నీచర్‌ ధ్వం సం చేసి, వాహనాలకు నిప్పు పెట్టిన పలువురు రైతులు, యువకులపై కేసులు నమోదు చేసినట్లు దిలావర్‌పూర్‌ ఎస్‌ఐ యాసీర్‌ ఆరఫత్‌ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. కంపెనీ ఉద్యోగులు కే సందీప్‌కుమార్‌, చంద్రశేఖర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 60 మంది రైతులు, యువకులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

అదేవిధంగా పరిశ్రమ వద్ద విధులు నిర్వహించడానికి వచ్చిన లోకేశ్వరం మండలానికి చెందిన ఇంటెలీజెన్స్‌(ఎస్‌బీ) హెడ్‌కానిస్టేబుల్‌ లక్కపెల్లి జీవన్‌రావు, భైంసాకు(ఎస్‌బీ) కానిస్టేబుల్‌ జే శంకర్‌రావు సెల్‌ ఫోన్‌లు తీసుకుని ధ్వంసం చేసిన ఘటనలో ఇంటెలిజెన్స్‌ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురు యువకులపై కూడా వివిధ సెక్షన్స్‌ కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులోనే కొందరిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు కూడా పెట్టినట్లు తెలిపారు.