తొలితరం తెలంగాణ నాయకులు, నిజామాబాద్ మాజీ ఎంపీ నారాయణ్ రెడ్డి మృతి

నిజామాబాద్ మాజీ ఎంపీ నారాయణ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌కు ఆదేశాలు జారీచేశారు. అంత్యక్రియల ఏర్పాట్లపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు చేయాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదేవిధంగా మాజీ మంత్రి కొమ్మరెడ్డి సురేందర్ రెడ్డి అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలతో ఏర్పాట్లు చేయాల్సిందిగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు నిర్దేశించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు.