భద్రాద్రి జిల్లా ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధి లోని అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న మాఫియా ను అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపైన ట్రాక్టర్ తో ఎక్కించి చంపడానికి చేసిన కుట్రలను అటవీ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు.
ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా ఉపెక్షించం.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంభందిత అధికారులతో మంత్రి కొండా సురేఖ ఫోన్ లో జరిగిన ఘటన అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ప్రభుత్వం లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిదంగా జరిగిన ఘటన ను పూర్తిగా విచారణకు ఆదేశించారు.
అటవీ ప్రాంతం లో గతంలో జరిగిన దాడుల దృష్ట్యా అధికారులు ఎల్లపుడూ అప్రమత్తంగా ఉంటు, ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న మా దృష్టికి తీసుకురావాలని అన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామం.. అవసరం అవుతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి తీసుకువచ్చి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని త్వరలోనే వెల్లడిస్తామని అటవీ & పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.