పర్యావరణ పరిరక్షణ సమితి 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించిన అటవీ, దేవాదాయ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

పర్యావరణ పరిరక్షణ సమితి 2024 క్యాలెండర్ ను తెలంగాణ సచివాలయంలో అటవీ, దేవాదాయ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగించేలా ముందుకుపోతున్నామని తెలిపారు. అటవీ రక్షణ, పచ్చదనం పెంపు నిరంతరాయ ప్రక్రియ అని మంత్రి తెలిపారు. 33 శాతం పచ్చదనం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చూస్తామన్నారు. ఎప్పటికప్పుడు నాటుతున్న మొక్కలు వాటి ఎదుగుదల కోసం మనకు మనమే బాధ్యత తీసుకోవాలన్నారు.

పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అటవీ, దేవాదాయ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలిపునిచ్చారు. భూమిపై మనుషులు మనుగడ సాగించాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలకు మంచి నీరు, గాలి, మట్టి అందించాలంటే ప్రతి ఒక్కరూ స్వతహాగా విరివిగా మొక్కలు నాటాలన్నారు.