తెలంగాణ‌కు ఆరుగురు ఐపీఎస్ అధికారుల కేటాయింపు

2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను ఆయా రాష్ట్రాల‌కు కేంద్రం కేటాయించింది. తెలంగాణ‌కు ఆరుగురిని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌ను కేటాయిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ‌కు ఆయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయికిర‌ణ్‌, మ‌న‌న్ భ‌ట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిని కేటాయించింది.