పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ శివారు పరిధిలోగల సాంబశివ ఇండస్ట్రీస్ వారి సాయి వెంకటేశ్వర రైస్ మిల్(Rice mill) ను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సీజ్ (Seized) చేశారు. రైస్ మిల్ నుంచి వెలువడుతున్న వ్యర్థపదార్థాలు తమ పొలాల్లోకి వస్తున్నాయని రైస్ మిల్ యాజమాన్యానికి రైతులు పలుమార్లు తెలిసినప్పటికీ వారు ఏ మాత్రం పట్టించుకోలేదు.
దీంతో రైతులు నెల రోజుల కిందట రామగుండం, హైదరాబాద్‌లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవారం అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వారి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం సాయి వెంకటేశ్వర రైస్ మిల్లును అధికారులు సీజ్ చేశారు.