సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పరామర్శించిన మంత్రి పొంగులేటి

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పరామర్శించారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయబాబుతో కలిసి దవాఖానకు వెళ్లిన మంత్రి పొంగులేటి.. ఆయన చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

కాగా, తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ప్రాథమికంగా అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నెల 16న అనారోగ్యంతో ఆయన ఏఐజీలో చేరిన విషయం తెలిసిందే. ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని, మరో 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకమని, అప్పటివరకు వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించడంతో పాటు వెంటిలేషన్‌తో కూడిన చికిత్స అందించడం జరుగుతుందని వెల్లడించారు.