గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌

తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌ కోటా(Governor Kota) ఎమ్మెల్సీల( MLCs)ను నియ మించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ కోదండరాం(Kodandaram ), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

అనేక వర్గాలను, సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన కృషి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలిపారు. అందులో భాగంగా కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని రేవంత్‌ రెడ్డి హామీనిచ్చారు. అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా ఖరారు చేసింది.