75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్ పీసీబీ) చీఫ్ ఇంజనీర్ బి .రఘు బోర్డు ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర విశిష్టతను వివరిస్తూ పౌరులు ప్రస్తుతం అనుభవిస్తున్న అనేక అంశాల్లో స్వేచ్ఛ ఉందన్నారు. వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల రక్తం, చెమటతో కూడిన పోరాటంతో ఇది సాధ్యమైంది. దేశం పట్ల అంకితభావంతో బాటు నిబద్ధత భావి తరాలకు ఉజ్వలమైన బాటలు వేసిన స్వాతంత్య్ర సమరయోధుల నుండి యువకులు స్ఫూర్తి పొందాలని కోరారు. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ స్థాపనను సూచిస్తుంది. కార్యక్రమంలో పీసీబీ ప్రధాన కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొని మాట్లాడారు.
