వీధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు : పీసీబీ సిబ్బందికి మంత్రి కొండా సురేఖ వార్నింగ్

విధుల పట్ల నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు తప్పవని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగులకు అటవీ, దేవాదాయ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సనతనగర్ లోని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఇవాళ మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా PCB ప్రధాన కార్యాలయంలోని ప్రతి సెక్షన్ ను కలియ తిరిగి ఫైళ్లను పరిశీలించారు. ఎంతమంది పనిచేస్తున్నారు.. ఎవరెవరు లీవ్ లో ఉన్నారో అగిడి తెలుసుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరు కావడం, నిర్ణీత సమయానికి కార్యాలయానికి రాకుండా ఇష్టా రీతిన వ్యవహరించే వారిపై కఠిన చర్యలుంటాయని అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. భవిష్యత్ లో తాను ఎప్పుడు తనిఖీ నిర్వహించినా అధికారులు, సిబ్బంది అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.