సంగారెడ్డి PCB RO ను గాలికి వదిలేశారా..!

◆ సంగారెడ్డి PCB RO అధికారుల అవినీతికి అడ్డు అదుపు ఉండదా..
◆ పొల్యూషన్ బాధితుల బాధలు వీరికి అవసరం లేదా..
◆ లంచాలు ఇస్తే చాలు చేయాల్సిన డ్యూటీని మర్చిపోతరా..
◆ బల్క్ డ్రగ్ పరిశ్రమలు, టైర్ పైరాలసిస్, క్రషర్లు ఇతర కాలుష్యకరక పరిశ్రమలు చేసే కాలుష్యం వీరి కంటికి కనపడదా..
◆ వచ్చిన ఫిర్యాదులను సైతం వసూళ్లకు వాడుకుంటున్నారు అంటున్న ఫిర్యాదుదారులు, పొల్యూషన్ బాధితులు..

◆ సంగారెడ్డి పరిధిలో పర్యావరణన్ని కాపాడే నాథుడే లేడా..
◆ గత మెంబర్ సెక్రటరీ(MS), వారంలో ఇన్స్ పెక్షన్ చేయాలి అని వేసిన కమిటీలు పనిచేయవా..
◆ కొత్త ప్రభుత్వంలోనైనా దారితప్పిన పి‌సి‌బి (PCB)ని దారిలో పెడతారని ఆశిద్దాం..

సీఎఫ్ఇ (CFE), సీఎఫ్ఒ(CFO) రెన్యువల్ కోసం వచ్చినా..
సీఎఫ్ఇ(కన్ సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్ మెంట్), సీఎఫ్ఒ(కన్సెంట్ ఫర్ ఆపరేషన్), రెన్యువల్, అనుమతుల జారీకి కావాలనే కాలయాపన చేస్తూ లంచం డిమాండ్ చేస్తున్నారంటూ పరిశ్రమల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా పరిశ్రమల నిర్వాహకులు 5, 10 ఏళ్లకోసారి రెన్యువల్ చేయించుకోవాలి. CFE (EXPANSION), CFE (CHANGE OF PRODUCT MIX), CFO (EXPANSION), TASK FORCE REVOCATION అప్లికేషన్స్ కూడా రావటం జరుగుతుంది. అలా వచ్చిన ఈ అప్లికేషన్స్ ను కావాలని కొన్ని నెలలపాటు తన వద్దే పెండింగ్ లో పెట్టుకొని ఆయా పరిశ్రమల వారు ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చేంత వరకు చివరికి మీరు ఏం చెప్తే అది చేస్తాం మేడం అని ఆమె ముందు సాగిలపడేంత వరకు తీసుకువచ్చి వీరి డిమాండ్ లన్నీ నేరవేర్చుకొని అప్పుడు ఆయా పరిశ్రమల యొక్క అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు సంబంధించి TSIPASS లో ఎలాంటి సరైన డాక్యుమెంట్స్ లేకపోయిన సరే పరిశ్రమల యొక్క ప్రతినిధులు కలిసి లబ్ది చేకూరిస్తే అది నిబంధనలకు విరుద్దంగా ఉన్నా సరే వాటికి పర్మిషన్ ఇప్పిచడం జరుగుతుంది. ఒకవేళ అన్నీ డాక్యుమెంట్స్ ఉన్న ఆయా పరిశ్రమల వారు కలవకపోతే వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తూ.. వారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్ పెక్షన్ లో ప్రతి ఒక అప్లికేషన్ పై పరిశ్రమను తరువుగా ఇన్స్ పెక్షన్ చేసి పొల్యూషన్ కంట్రోల్ కు సంబంధించిన అనేక నమూనాలను సేకరించి పరీక్ష చేయించి ఆ నివేదికల ఆధారంగా అనుమతులు మంజూరు చేయాలి. కానీ ఇవేమీ పట్టించుకోరు. వీరికి అందాల్సినవి అందితే ఒకే.. లేదంటే అప్పటివరకూ గుర్తుకు రానీ.. సోయిలో కూడా లేని మానిటరింగ్ టీంను రంగంలోకి దింపుతున్నారని పరిశ్రమల వారు వాపోతున్నారు. అంతేకాక ఇటువంటి అవినీతి అధికారులపై పిసిబి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోగా ఫిర్యాదు చేసిన పరిశ్రమల వారిని అందరూ కలిసి మరింత ఇబ్బందులకు గురిచేస్తారని అందుకే ధైర్యంగా బయటకు వచ్చి వీరు చేసే ఆగడాలను చెప్పలేక పోతున్నామని అనేక పరిశ్రమల వారు వాపోతున్నారు. ఈ కొత్త ప్రభుత్వంలోనైన పిసిబిలో పూర్తిస్థాయి ప్రక్షాళన జరగాలని మేధావులు, పర్యావరణవేత్తలు, కాలుష్య బాధితులు కోరుతున్నారు.

మైనింగ్ అక్రమాలలో పిసిబి (PCB) అధికారుల పాత్ర లేదా..?
9 రోజుల క్రితం మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించని మైనింగ్ లపై ప్రత్యేక టాస్క్ పోర్సు కమిటీ ఏర్పాటు చేశారు. పటాన్ చెరు మండలంలోని లకుడారం గ్రామంలో మైనింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేయడంతో మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ టాస్క్ ఫోర్స్ కమిటీని వేసి విచారణ చేపట్టారు. కమిటీ ఏర్పడిన 7 రోజుల్లోనే సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లయర్ సంస్థ క్వారీనీ అధికారులు సీజ్ చేశారు. ఈ సంస్థ యాజమాన్యం మైనింగ్ నిబంధనలను నామమాత్రం కూడా పాటించడం లేదని కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించారని క్వారీనీ సీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆర్డీవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. లకుడారం గ్రామ పరిధిలోని 37 క్రషర్ల యాజమాన్యాలు మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పాటించడం లేదని అన్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీ పూర్తి నివేదిక 2 రోజుల్లో రానుందని నివేదిక ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాజమాన్యాలు మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఇన్ని క్రషర్లు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంగిస్తున్న పిసిబి (PCB) అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటే ఎంత భారీ అవినీతి జరుగుతుందో.. మీ ఊహాకే వదిలేస్తున్న.. ఒక్క లకుడారంలోనే ఇంత జరుగుతుంటే మొత్తం సంగారెడ్డి RO పరిధిలో క్రషర్లు ఎలా నడుస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఇన్ని క్రషర్లు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పాటించకుండా నడుస్తుంటే PCB RO అధికారులు ఏం చేస్తున్నట్టు. ఈ అక్రమాలలో PCB RO అధికారుల పాత్ర లేదా.. వారిపై ఎలాంటి చర్యలు ఉండవా.. తప్పంతా క్రషర్ల యాజమాన్యాలదేనా.. తప్పు చేస్తున్న వారిని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత PCB అధికారులకు లేదా.. వీరికి అందాల్సినవి అందితే ఎవరు ఏ తప్పు చేసిన వదిలేస్తారా.. ఇంతకాలం పాటు ఎన్నో ఫిర్యాదులు చేసిన ఎందుకు పట్టించుకోలేదు. వారి ఫిర్యాధులు వీళ్ళకు కనిపించలేదా.. కొత్త ప్రభుత్వం వచ్చి మంత్రి స్థాయిలో ఫిర్యాదులు వెళ్ళి మంత్రి ఆదేశిస్తే కమిటీ వేసి చర్యలు తీసుకుంటారా.. ఇలా వెంటనే స్పందించే మంచి గుణమున్న మంత్రి లేకపోతే.. పరిస్థితి ఎంటి.. వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలి.. క్రషర్లు ఇన్ని తప్పులు చేస్తున్నాయి అంటే బల్క్ డ్రగ్ పరిశ్రమలు ఎన్ని తప్పులు చేస్తుండొచ్చు.. బల్క్ డ్రగ్ కాలుష్య బాధితులను ఎవరు పట్టించుకోవాలి. ఎన్ని ఫిర్యాదులు చేయాలి.

బల్క్ డ్రగ్ పరిశ్రమలు, టైర్ పైరాలసిస్ పరిశ్రమలు, క్రషర్లు ఇతర కాలుష్యకరక పరిశ్రమలు విపరీతమైన కాలుష్యం చేస్తున్నాయి అని ఫిర్యాదులు చేస్తే కొన్ని నెలలపాటు కాలం గడిపి వారి నుండి కావల్సినంత పిండుకొని ఆయా పరిశ్రమల వారికి ముందస్తు సమాచారం ఇచ్చి.. ఫిర్యాదుదారులకు మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆయా పరిశ్రమల వారినే వాహనాలు పంపమని ఆయా వాహనాల్లోనే సీక్రెట్ గా వెళ్ళి ఏదో తు..తు.. మంత్రంగా ఇన్స్ పెక్షన్ చేసి.. చేయలేదనకుండ ఒక పసలేని రిపోర్ట్ తయారు చేసి వారికి నచ్చినప్పుడు టాస్క్ ఫోర్స్ కు పంపితే.. అక్కడ ఇంకో నాటకానికి తెరతీస్తారు. ఇక ఆ నాటకం గురించి చెప్పుకోవాలంటే పెద్ద గ్రంధమే అవుతుంది. అతి త్వరలోనే ఆ గ్రంధాన్ని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని పలువురు పర్యావరణ వేత్తలు, మేధావులు, పొల్యూషన్ బాధితులు తెలిపారు. అంతేకాకుండా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ లోనే స్వయంగా మెంబర్ సెక్రటరీ కమిటీ వేసి వారంలో పక్కాగా ఇన్స్ పెక్షన్ చేసి రిపోర్ట్ పంపండి అని చెప్పినా.. దానిని గాలికి వదిలేస్తారు. ఇక పొల్యూషన్ బాధితుల బాధలు అయితే వీరు చాలా చులకనగా చూస్తారు, తేలిగ్గా తీసుకుంటారని పర్యావరణ వేత్తలు, కాలుష్య బాధితులు చెబుతున్నరు.

సంగారెడ్డి పిసిబి అధికారులు ఇన్స్ పెక్షన్ కు వెళ్లాలంటే పరిశ్రమల వారు బండి పంపాలా.. తెలంగాణ PCB వీరికి వాహనం ఇవ్వలేదా..వీరి వాహనాలకు ప్రభుత్వం ఇంధనం ఇవ్వడం లేదా..పరిశ్రమల వారు పోస్తేనే PCB బండి కదులుతుందా.. వారి బండ్లలో ఇంధనం పోయడమే కాకుండా క్యాన్ లలో కూడా నింపుకుంటున్నారు అని పలువురు పరిశ్రమల వారు వాపోతున్నారు. ఇంతగా దిగజారిన ఈ అవినీతి అధికారులు ఇక మమ్మల్ని ఏం పట్టించుకుంటారు అని ఈ విషయం తెలిసిన ఫిర్యాదుదారులు, పొల్యూషన్ బాధితులు అంటున్నారు.

◆ సంగారెడ్డి పరిధిలో పర్యావరణన్ని కాపాడే నాథుడే లేడా..
◆ గత మెంబర్ సెక్రటరీ(MS), వారంలో ఇన్స్ పెక్షన్ చేయాలి అని వేసిన కమిటీలు పనిచేయవా..
◆ పిసిబి ఉన్నతాధికారులకు ఎలాగూ పట్టదు..
◆ పూర్తిస్థాయి మెంబర్ సెక్రటరీ ఉంటేనే పని చేస్తారా..
◆ వీళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేసేది ఎవరు..
◆ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతున్న ఆ అవినీతి అధికారిపై చర్యలు ఉండవా..
◆ ZO కార్యాలయ అధికారులు చెప్పిన పట్టించుకోదు.. ప్రధాన కార్యాలయంలో కొంతమంది ఉన్నతాధికారుల అండతోనే ఇలా రెచ్చిపోతున్నారని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు..

◆ ఈ అధికారి వెనుక ఉన్న ఆ ఉన్నతాధికారి ఎవరు..? ఈ అధికారికి అంత విచ్చలవిడి అవినీతి చేయడానికి ధైర్యం ఇస్తున్న ఆ ఉన్నతాధికారి బాగోతం కూడా బయట పెడతామంటున్న పరిశ్రమల నిర్వాహకులు, పర్యావరణ వేత్తలు.. అంతేకాకుండా ఈ అవినీతిలో తారస్థాయికి పోయిన కొంతమంది అవినీతి అధికారుల వలన మిగిలిన అధికారులకు కూడా చెడ్డ పేరు వస్తుందని పలువురి నోట వినిపిస్తున్న మాట.

◆ సంగారెడ్డి EE, AEE లపై సీఎం రేవంత్ రెడ్డి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, సంగారెడ్డి కలెక్టర్, ఆర్‌డి‌ఓ, ఏసీబీ, విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ కు ఫిర్యాదు చేస్తామంటున్న క్రషర్ల బాధితులు, పర్యావరణ వేత్తలు, ఫిర్యాదుదారులు, కాలుష్య బాధితులు..

◆ సీఎం రేవంత్ రెడ్డి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కొత్త ప్రభుత్వంలో ఆయిన పిసిబి(PCB) మీద కాస్త దృష్టి పెట్టి దారిలో పెట్టాలని కోరుతున్న పలువురు మేధావులు, పర్యావరణ వేత్తలు, పొల్యూషన్ బాధితులు..

◆ కొత్త ప్రభుత్వంలోనైనా దారితప్పిన పి‌సి‌బి (PCB)ని దారిలో పెడతారని ఆశిద్దాం..

సంగారెడ్డి PCB RO కార్యాలయం పరిధిలో జరుగుతున్న అవినీతి అధికారుల బాగోతాలపై మరియు ఆయా అధికారులు గతంలో పనిచేసిన చోట చేసిన, జరిగిన అనేక అవినీతి అక్రమాలపై కండ్లు బైర్లు కమ్మే నిజాలను పూర్తి ఆధారాలతో “రాబోయే కథనంలో” మీ ముందుకు తీసుకువస్తుంది.. మీ ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం.. అవినీతిపైనే మా పోరాటం..