వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో డిప్యుటేష‌న్లు ర‌ద్దు

రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో డిప్యుటేష‌న్లు ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. డిప్యుటేష‌న్‌లో ఉన్న‌వారు త‌మ పూర్వ‌స్థానాల్లో రిపోర్ట్ చేయాల‌ని ఆదేశించింది. ఈ నెల 8వ తేదీన సాయంత్రం లోపు రిపోర్ట్ చేయాల‌ని, లేని యెడ‌ల చ‌ర్య‌లు ఉంటాయ‌ని తెలిపింది.