తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్‌ను (Budget) ప్రవేశపెట్టింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రూపొందించింది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రతిపాదనలను చదివి వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమవేశమైన రాష్ట్ర మంత్రి మండలి బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కాగా, ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించవచ్చని తెలుస్తున్నది. అయితే ఇది గత బడ్జెట్ కంటే రూ. 20 వేల కోట్లు తక్కువ.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను డిప్యూటి సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్నారు. మార్పును కోరుతూ తెలంగాణ ప్రజలు మా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
- 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్..
రూ. 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లు
మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు - ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు..
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఈ కేటాయింపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం మాత్రమే చేయడం జరిగిందన్నారు. హామీలకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున, అది పూర్తయిన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తాం అని విక్రమార్క తెలిపారు. - వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా..
పరిశ్రమల శాఖకు రూ. 2,543 కోట్లు కేటాయింపు..
ఐటీ శాఖకు రూ. 774 కోట్లు కేటాయింపు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 40,080 కోట్లు
మూసీ నది అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11,692 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ. 19,746 కోట్లు - ఎస్టీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ. 250 కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ. 21,874 కోట్లు
ఎస్టీ సంక్షేమానికి రూ. 13,313 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ. 2,262 కోట్లు
బీసీ గురుకులాల స్వంత భవనాల నిర్మాణానికి రూ. 1,546 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 8,000 కోట్లు - కీలక శాఖలకు కేటాయింపులు ఇలా..
నీటిపారుదల శాఖకు రూ. 28,024 కోట్లు
విద్యారంగానికి రూ. 21,389 కోట్లు
వైద్యారోగ్య రంగానికి రూ. 11,500 కోట్లు
గృహజ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ. 16,825 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ. 7,740 కోట్లు
రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ..
రైతుల రుణమాఫీపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా భట్టి రైతు రుణమాఫీపై మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. రూ. 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అందుకు విధివిధానాలను రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర కూడా అందిస్తామన్నారు.
కౌలు రైతులకు కూడా రైతు భరోసా
రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రకటించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. రైతుబంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. అదే విధంగా ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల భీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని తెలిపారు. రైతుబీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని చెప్పారు.