పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీల(Transfer ) పర్వం కొనసాగుతున్నది. మొన్న రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. నిన్న ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్ల (Excise superintendents)ను బదిలీ చేసింది. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలో 40 మంది మున్సిపల్ కమిషర్లను( Municipal commissioners) బదిలీ చేసింది. రేపటిలోగా ఆయా ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది.అయితే, రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.