టీటీజీడీఏ వెబ్‌సైట్‌ ఆవిష్కరించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

తెలంగాణ టీచిం గ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (టీటీజీడీఏ) వెబ్‌సైట్‌, క్యాలెండర్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. బుధవారం మంత్రిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సంఘం రాష్ట్ర ప్రతినిధులు కలిసి పలు అంశాలపై చర్చించారు.

బదిలీలు, దవాఖానల్లో వసతుల కల్పన, కొత్తగా ఏర్పడిన కాలేజీల్లో పోస్టుల భర్తీ తదితర అంశాలపై హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జెడ్‌ చొంగ్తూకి వారు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ అన్వర్‌, ప్రధాన కార్యదర్శి తిరుపతి రావు, ఉపాధ్యక్షుడు కిరణ్‌ మాదాల, కోశాధికారి కిరణ్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు.