రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం మధ్యాహ్నం సంభవించిన ఈ పేలుడు ధాటికి పరిశ్రమ షెడ్డు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మిగతా కార్మికులు భయంతో పరుగులు తీశారు. అయితే కూలిన షెడ్డు కింద కొంతమంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గాయపడ్డ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
