రిటైర్డ్ ఉద్యోగులు ఔట్?

◆ డ్యూటీల నుంచి రిలీవ్ కావాలని సర్కారు ఆదేశాలు
◆ నేడో.. రేపో.. ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు రిలీవ్ కావాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం జీఏడీ నుంచి పలువురు అధికారులకు ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. ఫోన్లు వచ్చిన అధికారులు రిలీవ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ తో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో పలువురు అధికారులు రిలీవ్ అయ్యారు. విద్యుత్ శాఖలో రిటైర్ అయి డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారిని ప్రభుత్వం తొలగించింది. అన్ని శాఖల్లో కలిపి మొత్తం 1050 మంది రిటైర్డ్ అధికారులు కన్సల్టెంట్లుగా పనిచేస్తున్నారు.

అందరిని రిలీవ్ చేయాల్సిందే అని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి వీరంతా ఉన్నత స్థాయిల్లో కొనసాగుతుండటం వల్ల చాలా మంది అధికారులు ప్రమోషన్లు రాకుండా రిటైర్ అయ్యారని చెబుతున్నారు. దీంతో పాటు రిటైర్ అయిన అధికారులపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై కూడా కొత్త ప్రభుత్వం విచారణ జరిపించాలంటున్నారు.