ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని తెలిపారు. లాస్య నందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శుక్రవారం తెల్లవారుజామున పఠాన్‌చెరూ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌కు ఢీకొట్టడంతో ఎమ్మెల్యే అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. లాస్య నందిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే సాయన్న గతేడాది ఇదే నెలలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నందితకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కంటోన్మెంట్‌ సీటు ఇచ్చారు. ఆమె బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు.