హైకోర్టులో జీపీలు, ఏజీపీల నియామకం

ప్రభుత్వం తరఫున హైకోర్టులో కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11 మంది గవర్నమెంట్‌ ప్లీడర్లను, 44 మంది అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్లను నియమించింది. ఈ మేరకు న్యాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ న్యాయవాదులు (జీపీలు)గా ఈ రమేశ్‌ చంద్రగౌడ్‌, భూక్యా మంగీలాల్‌ నాయక్‌, షాజియా పర్వీన్‌, ఎన్‌ఎస్‌ అర్జున్‌ కుమార్‌, శాంతి నీలం, బీ మోహనరెడ్డి, మురళీధర్‌రెడ్డి కాట్రాం, ఏ జగన్‌, శాంతాపూర్‌ సత్యనారాయణ, గడ్డం వీరాస్వామి, మహేశ్‌ రాజే నియమితులయ్యారు. ప్రభుత్వ సహాయ న్యాయవాదులు (ఏజీపీలు)గా నియమితులైనవారిలో సైడం లక్ష్మీనారాయణ, బొడ్డు శ్రవణ్‌కుమార్‌, కలగూర శ్రీనివాస్‌, గీతా తిరందాసు, శిల్పా గెల్లి, జీ ప్రశాంత్‌, రేలా కృష్ణస్వామి, టీ చైతన్య కిరణ్‌, సౌరభ్‌ అగర్వాల్‌, ఎస్‌ స్వాతి, ఠాకూర్‌ నితేందర్‌సింగ్‌, బబిత, లక్ష్మల సందీప్‌, ధరావత్‌ రవి, ఎర్రి రవీందర్‌రెడ్డి, సయ్యద్‌ ఖదీర్‌, ప్రొద్దుటూరి రాజీవ్‌రెడ్డి, పత్తిపాక కవిత, కత్రావత్‌ శంకర్‌, దల్వాల్‌ లలిత, హెచ్‌ రాకేశ్‌ కుమార్‌, నాగరాజు గాలి, ప్రసాద్‌ రావణబోయినతోపాటు మరికొందరు ఉన్నారు.