లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌..

త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్‌కు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబూబాద్‌ స్థానానికి మాలోత్‌ కవిత పేర్లను ప్రకటించారు.

ఆది, సోమవారాల్లో నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో బీఆర్‌ఎస్‌ అధినేత వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలపై నేతలతో చర్చించి.. అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాలను సేకరించారు. ఈ క్రమంలో ముఖ్యనేతల అభిప్రాయం మేరకు.. సమష్టి నిర్ణయంతో తొలి విడుదతలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలువబోతున్న అభ్యర్థులకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.