◆ అసమర్థ అధికారుల్ని సాగనంపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
పరిశ్రమలు నెలకొల్పాలన్నా, ఆ పరిశ్రమలను నిర్వహించాలన్నా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్ మెంట్ (సీఎఫ్ఈ), కన్ సెంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్ఓ) అనుమతులు తప్పనిసరి. వీటి జారీ చేస్తున్న అధికారులపై పర్యవేక్షణ లేకపోవడం పీసీబీలోని కొందరికి వరంగా మారింది. ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండని కారణంగా అనుమతుల రెన్యువల్ కోసం వచ్చే వారి పైళ్లను నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా పరిశ్రమల నిర్వాహకులు 5, 10, 15 ఏళ్లకోసారి రెన్యువల్ చేయించుకోవాలి. నిబంధనల ప్రకారం కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా..? పరిశీలించి అవసరమైతే బృందాన్ని పంపి శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు పంపి రిపోర్టు ఆధారంగా అనుమతులు రెన్యువల్ చేయాలి. కానీ అవేవీ జరగడం లేదన్న ఆరోపణలున్నాయి.
తీవ్రంగా పరిగణించిన హైకోర్టు
కాలుష్య నియంత్రణ మండలిలో పీసీబీ అధికారుల తీరుపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చినా ఇవ్వలేదంటూ ఫిబ్రవరి 15న మూసివేత ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లాలోని ప్రోస్టర్స్ అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన ధర్మాసనం ఒక అధికారి నోటీసులు జారీచేయడం, మరో అధికారి మూసివేత ఉత్తర్వులు ఇవ్వడమేమిటని ప్రశ్నించింది. జాయింట్ చీప్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీరుపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అతన్ని కొనసాగిస్తే కోర్టు దిక్కరణగా తీసుకొని ఉత్తర్వులు జారీ చేస్తామని వ్యాఖ్యానించింది. 7 నెలలుగా పీసీబీ పనితీరు దారుణంగా ఉందని, సమర్ధుల్ని నియమించాలని హితవు పలికింది.(సోర్స్: ఈనాడు)
◆ అసమర్థ అధికారుల్ని సాగనంపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
◆ ఏసీబీ కోర్టు, హైకోర్టు, ప్రభుత్వ ఆదేశాలను కూడా పిసిబి అధికారులు పట్టించుకోరా..?
◆ హైకోర్టు ఆదేశాలకు కూడా వక్రభాష్యం అల్లుతున్న ఆ అధికారి ఎవరు..?
◆ తెలంగాణ పిసిబి ప్రభుత్వ పరిధిలోకి రాదా..?
◆ తెలంగాణ పిసిబిలో కొంతమంది అవినీతి అధికారులు.. అవినీతి సొమ్ముతో ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనుకుంటున్నారా..?
◆ ప్రభుత్వాన్ని, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి, చైర్ పర్సన్ మరియు మెంబర్ సెక్రటరీలను పక్కదారి పట్టిస్తున్న తెలంగాణ పిసిబి(PCB) అధికారి ఎవరు..?
◆ తెలంగాణ పిసిబిలో ఆ రిటైర్డ్ అధికారి పెత్తనం ఏంది..?
◆ ఆ రిటైర్డ్ అధికారి లేకుండా పిసిబి ముందుకు పోదా..?
◆ ఆ రిటైర్డ్ అధికారి అంత నిజాయితీపరుడా..?
◆ అవినీతిపరులకు కొమ్ముకాయడమే ఆయన పనా..?
◆ ఈ అధికారికి ఉన్నంత టెక్నికల్ నాలెడ్జ్ పిసిబిలో మరే ఇతర అధికారులకు లేదా..?
◆ ఈయన గారి టెక్నికల్ సలహాలే పిసిబిని నడిపిస్తున్నాయా..?
◆ రిటైర్డ్ అధికారులను తొలగించాలని ప్రభుత్వం చెప్పిన మాట పిసిబికి వర్తించదా..?
◆ పిసిబిలో ఆయన పని ఎంటి.. ఆయన చేస్తున్నదేంటి..?
◆ తెలంగాణ పిసిబిలో ఆ రిటైర్డ్ అధికారి పెత్తనం ఎక్కువైందా..?
◆ నిజానిజాలు త్వరలో మీ ముందుకు తీసుకువస్తుంది మీ “నిఘా నేత్రం న్యూస్”..