హైదరాబాద్ : బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో కేసీఆర్ నల్లగొండ లోక్‌సభ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థిపై సమావేశంలో చర్చిస్తున్నారు.
ఈ సమావేశానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, రవీంద్ర నాయక్, గ్యాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సీనియర్ నాయకులు చెరుకు సుధాకర్‌తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.