నల్లగొండ జిల్లాలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై కొలువై ఉన్న శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామివారి బ్రహోత్సవాలు ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్రహ్మోత్సోవాలు ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి రాత్రి స్వామివారికి పర్వత వాహన సేవ, తెపోత్సవం, అశ్వవాహన సేవను నిర్వహించనున్నారు.