లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌

రూ. 10 వేలు లంచం(Bribe) తీసుకుంటూ తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి(Rangareddy) జిల్లా తూనికలు, కొలత శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఉమారాణి వ్యాలిడిటీ సర్టిఫికెట్‌ చేయడానికి లచం డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు గిరిధర్‌రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు గురువారం లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.