పల్లె రవి కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

 తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్‌కు ప్ర‌మాదం త‌ప్పింది. స్వ‌ల్ప గాయాల‌తో ర‌వికుమార్ బ‌య‌ట‌ప‌డ్డారు.
ఖైర‌తాబాద్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న త‌న మిత్రుడిని ప‌రామ‌ర్శించి ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా, తను ప్ర‌యాణిస్తున్న కారు టైర్ కొత్త‌పేట క్రాస్ రోడ్డు వ‌ద్ద ప‌గిలిపోయింది. దీంతో కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను, మెట్రో పిల్ల‌ర్‌ను ఢీకొట్టింది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావ‌డంతో ర‌వి కుమార్‌కు ప్ర‌మాదం త‌ప్పింది. ర‌వి కుమార్, ఆయ‌న మిత్రుడు రాజు, డ్రైవ‌ర్ ఖ‌దీర్ స్వ‌ల్ప గాయాల‌తో బయ‌ట‌ప‌డ్డారు.