తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు : కేటీఆర్

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ఉగాది వేడుక‌ల్లో కేటీఆర్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ‌కీయాలు ఎప్పుడూ ఉంటాయి. పండుగ‌పూట రాజ‌కీయాలు మాట్లాడ‌కూడ‌దు. ఈ సంవ‌త్స‌రం అంద‌రికీ మంచి జ‌ర‌గాలి. మ‌త‌క‌ల్లోలాలు లేకుండా ప్ర‌జ‌లంద‌రూ శాంతియుతంగా ఉండాలి. వ్య‌వ‌సాయం బాగుండాలి. వాతావ‌ర‌ణ అనుకూల ప‌రిస్థితులు రావాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు.