చింత‌మ‌డ‌క‌లో శ్రీరామ‌న‌వమి వేడుక‌లు.. కేసీఆర్ దంప‌తుల‌ను ఆహ్వానించిన గ్రామ‌స్తులు

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి స్వ‌గ్రామం చింత‌మ‌డ‌క‌లో ఈ నెల 17వ తేదీన శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను నిర్వ‌హించనున్నారు. ఈ క్ర‌మంలో సీతారాముల క‌ల్యాణ మ‌హోత్స‌వ వేడుక‌కు హాజ‌రు కావాల‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత క‌ల్వ‌కుంట్ల వంశీధ‌ర్ రావు కేసీఆర్ దంప‌తుల‌ను ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆహ్వాన ప‌త్రాన్ని కేసీఆర్‌కు అంద‌జేశారు. కేసీఆర్‌ను క‌లిసిన వారిలో చింత‌మ‌డ‌క గ్రామ పెద్ద‌లు, ఆల‌య క‌మిటీ స‌భ్యులు ఉన్నారు.