రూ.10 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డ డీటీ

ఏపీలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా చిక్కాడు. మచిలిపట్నంలోని పౌరసరఫరాల శాఖలో డీటీ(DT) గా పనిచేస్తున్న చెన్నూర్‌ శ్రీనివాస్‌ అనే ఉద్యోగి  రైస్‌మిల్‌ (Ricemill) యజమాని ప్రతినెలా మామూళ్లు ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీచేశాడు.

బుధవారం రైస్‌మిల్‌ యజమాని నుంచి రూ. 10 వేల లంచం తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు డీటీని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు డీటీ కార్యాలయంపై దాడులు నిర్వహించామని ఏసీబీ ఏఎస్పీ స్నేహిత తెలిపారు. డీటీ రూ. 10 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నామని వివరించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆమె వెల్లడించారు.