నాగ‌ర్‌క‌ర్నూల్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

నాగ‌ర్‌క‌ర్నూల్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వర్గం నుంచి బీఆర్ఎస్ త‌ర‌పున ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మొద‌టి సెట్ నామినేష‌న్ ప‌త్రాల‌ను నాగ‌ర్‌క‌ర్నూల్ పార్ల‌మెంట్ రిట‌ర్నింగ్ అధికారి పీ ఉద‌య్ కుమార్‌కు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, జైపాల్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు.