ట్విట్టర్ లోకి ఏసీబీ (ACB)

  • అధికారిక ఖాతా తెరిచిన తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ

కరప్షన్ ఫ్రీ తెలంగాణ దిశగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకు సోషల్ మీడియా వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ఏసీబీ(ACB) తెలంగాణ పేరుతో తొలిసారి అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతా తెరిచింది. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ప్రొఫైల్ ఫోటోతో ఉన్న ఈ అకౌంట్లో తొలిపోస్ట్ చేసిన ఏసీబీ.. ఫిర్యాదులను ట్విట్టర్ వేదికగా చేయవద్దని సూచించింది. టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా వాట్సాప్ నెంబర్ 9440446106 లేదా [email protected] ద్వారా ఫిర్యాదులు చేస్తే అవినీతి అధికారులను పట్టుకోవచ్చని సూచించింది. ట్విట్జర్ ద్వారా ఫిర్యాదులు చేస్తే అవినీతిపరులు జాగ్రత్త పడే అవకాశం ఉందని పేర్కొన్నది. ఏసీబీ(ACB) మంచి నిర్ణయంపై తీసుకున్నదంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.